Login
Username: Password:

Login


Signup
Forgot Password?
Search
events calendar
« Feb 2012 »
S M T W T F S
      1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29

__add_event
Your one stop Portal for Vijayawada
  news

కేసీఆర్ చావాలని యాగం చేస్తారా? : నల్లాల ఓదేలు ప్రశ్న
Wednesday, Feb 22, 2012 07:28
నాలుగున్నర కోట్ల ప్రజానీకం గుండెచప్పుడైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు చావాలని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు యాగం చేస్తారా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిది నోరు కాదని అది మోరి అని మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు మరోమారు చేస్తే నాలుక కోస్తామని ఆయన హెచ్చరించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ అధినేత చంద్రబాబుకు జాగీరుగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన దళిత జాతికి తీరని తలవంపులు, అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ తీర్మానం పెట్టమన్నందుకు బయటకు ఈడ్పీంచిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, ప్రేక్షక పాత్ర వహించి మిన్నకుండిపోయిన తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఖురాన్ దగ్ధం సంఘటనపై అమెరికా క్షమాపణలు
Wednesday, Feb 22, 2012 08:10
ఆఫ్గనిస్థాన్‌లో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను దగ్ధం అయిన సంఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణలు కోరింది. ఈ సంఘటన యాదృచ్చికంగా జరిగిందే కాని ఎటువంటి దురుద్ధేశాలు లేవని ప్రకటించింది. అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పనెట్టా ఈ వ్యవహారంపై మాట్లాడుతూ, తమ దేశం అన్ని మతాలను గౌరవిస్తుందని, ఇందులో ఎటువంటి మినహాయింపులు తమకు లేవని చెప్పారు.

ఉప ఎన్నికల ఫలితాలతో దిమ్మదిరిగి పోవాలి : ఈటెల
Wednesday, Feb 22, 2012 07:24
త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో సీమాంధ్ర నేతలతో పాటు.. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదం చాటాలన్నారు. ఉప ఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చించినట్లు చెప్పారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు పాలమూరు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పల్లెబాట కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 29వ తేదీ వరకు ప్రతి పల్లె తిరుగుతామన్నారు.

పార్థసారథీ... చంచల్ గూడ జైలులో ఉంటావ్ జాగ్రత్త: బాబు
Wednesday, Feb 22, 2012 04:20
రాష్ట్రమంత్రి పార్థసారథి చంచల్ గూడ జైలుకెళ్లాల్సి వస్తుందని తెదేపా చీఫ్ చంద్రబాబు అన్నారు. రచ్చబండలో ఇళ్ల కేటాయింపుల్లో మంత్రి పార్థసారథి, విపక్ష ఎమ్మెల్యేలకు చోటు పెట్టకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు. ఇళ్ల కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగితే, దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.

ఈసీ అధికారాలకు కత్తెర .. మీడియా సృష్టేనంటున్న కేంద్రం
Wednesday, Feb 22, 2012 04:24
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి చట్టబద్ధత కల్పించడం ద్వారా కమిషన్ అధికారాలను కుదించాలని యుపీఏ సర్కారు యోచిస్తోందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వి.నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఈసీ అధికారాలను కుదించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.ఆ వార్తల్లోని అంశాలు పూర్తిగా దురుద్దేశపూరితం. ప్రభుత్వం, మంత్రుల గ్రూపుగానీ అలాంటి ఆలోచన ఏదీ చేయడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఒకరి పెళ్లి మరొకరి చావుకు కారణం కారాదు: చంద్రబాబు
Wednesday, Feb 22, 2012 03:18
వీఆర్వో పరీక్షల సమయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నట్లుండి పరీక్షా కేంద్రాన్ని మార్చడం వల్ల ఓ వ్యక్తి దుర్మరణం పాలవడమే కాక అభ్యర్థి తీవ్ర గాయాలపాలయ్యారనీ, మంత్రిగారి ఇంట పెళ్లి విందు మరొకరి చావుకు కారణమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను పల్లెత్తు మాటంటే నాలుక కోస్తాం : టీఆర్ఎస్
Wednesday, Feb 22, 2012 01:18
తమ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావును పల్లెత్తు మాట అంటే నాలుక కోస్తామని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ సభ్యులు హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేయాలంటూ వారు పట్టుబడుతున్న విషయం తెల్సిందే. ఇందుకోసం వారు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో టీఆర్ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అనంతరం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ తమపై సస్పెండ్ వేటు వేయడం సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల కుట్రగా అభివర్ణించారు. అందుకే.. ఈ సభను సీమాంధ్ర సభ అంటూ తాము చేస్తున్న ప్రచారం మరోమారు రుజువైందన్నారు. సభలో తమ గొంతు నొక్కేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్రయత్నించాయన్నారు.

కేసీఆర్ పీడ విరగడయ్యేందుకు చండీయాగం : మోత్కుపల్లి
Wednesday, Feb 22, 2012 01:10
తెలంగాణ ప్రాంతానికి టీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు పీడ విరగడయ్యేందుకు చండీయాగం నిర్వహిచనున్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ ఓ చీడపురుగులా తయారయ్యారన్నారు. ఈ ప్రాంతానికి కేసీఆర్ అనే పీడ విరగడయ్యేందుకు త్వరలోనే చండీయాగం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ చండీయాగం తేదీ, స్థలాన్ని త్వరలోనే నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమంలో సుమారు 700 మంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు తీసుకున్నారన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వెనక్కి పోతోందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను, ఉద్యమాన్ని కేసీఆర్ తన రాజకీయ స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.

తెలంగాణకు అనుకూలమైతే లేఖ ఇవ్వు బాబూ : హరీష్
Wednesday, Feb 22, 2012 01:04
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైతే తక్షణం లేఖ ఇచ్చి తన నిజాయితీని నిబద్ధతను నిరూపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి.హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో కల్తీసారా తాగి చనిపోయినవాళ్ల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు.. తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో 800 మంది చనిపోతే ఏ ఒక్కరి కుటుంబాన్నీ పరామర్శించలేదని ఆయన మండిపడ్డారు. నాలుగు కోట్ల ప్రజలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.

తెలంగాణ కోసం రాజీనామా చేసేవారికి మద్దతివ్వం: కిషన్
Wednesday, Feb 22, 2012 00:03
తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య రోజురోజుకీ గ్యాప్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం తెరాస వైఖరే అని స్పష్టంగా తెలుస్తోంది.తెలంగాణ కోసం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఆనక తెలంగాణ సెంటిమెంట్ అంటూ తెరాసలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయడంపై భాజపా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.